History of Temples

శ్రీ వైకుంఠపురం దేవస్థానం

శ్రీ మహాలక్ష్మి గోదా సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి

శ్రీ వైకుంఠాపురం – సంగారెడ్డి శివారు

-: స్థల పురాణం :-
సుమారు 600 సంవత్సరాల క్రితం జప అనుష్ఠానము
కొరకై వేంచేసిన మహానుభావుడు
అన్న పాదములు సేకరించక స్వామి వారి జప సేవా కైంకర్యములతో కాలము గడుపుతూ ఉండేవాడు
ఎంతోమంది భక్తులు సాదురూపంలో ఉన్న ఆ స్వామి వారిని దర్శించుకుని కష్టసుఖాములు స్వామివారికి విన్నవించి
వారి కోర్కెలు స్వామి ద్వారా తీర్చుకుంటూ స్వామి అనుగ్రహాన్ని పొందేవారు.
కొంతకాలం తర్వాత అక్కడికి వచ్చే భక్తులతో ఒక సుందరమగు ఆలయాన్ని నిర్మింపజేసి,
త్వరలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట కాబోతున్నారు అని చెప్పాడు.
ఆ ప్రతిష్ట ముహూర్తాన్ని మార్గశుద్ధ పంచమి రోజున నిర్ణయం చేసి ఉన్నారు. కొంతకాలము గడిచింది,
ప్రతిష్ట ముహూర్తము రానే వచ్చింది ఆ సాధువు మాత్రం అక్కడ వెలసిన పాల గుండం నీళ్ల గుండం
అనే పేర్లు గల రెండు గుండాలతో నిత్యము స్నాన ,సంధ్యాదులు ఆచరిస్తూ
అనుష్టానం చేస్తూ భగవాన్ నామస్మరణ జపంతో మునిగిపోయేవాడు.
ఒక రోజు సాధు వద్దకు వచ్చి అయ్యా మీరు చెప్పిన ముహూర్త సమయము రానే వచ్చింది,
ప్రతిష్ట విగ్రహం ఇంకనూ రాలేదు మరియు తత్సంబంధమైన యజ్ఞ యాగాది క్రతువులు ఆరంభము కాలేదు,
మరి ప్రతిష్ట ఎలా చేస్తారు? అని సాధువును అడిగారు. ఆ సాధువు వారితో ఏమీ మాట్లాడకుండా
నీలగుండం వద్దకు స్నానానికి సాధువు వెళ్ళాడు, భక్తులు గంట రెండు గంటలు అలా ఎదురు చూస్తూ ఉన్నారు,
ఇంకనూ ఆ సాధువు రాకపోయేసరికి నలుపక్కల వెతుకులాట కొనసాగించారు.
నీలగుండం ప్రక్కగా వెళ్ళినటువంటి ఒక భక్తుని కి ఆ గుండం ప్రక్కగా ఆ సాధువు ధరించిన ఉత్తర్యం కనిపించింది,
ఆ భక్తుడు మిగతా భక్తులకు ఈ విషయాన్ని తెలియపరచాడు, ఆ సాధు ఉత్తరీయము ఇక్కడ ఉన్నందున
ఆ సాధువు స్నానాని కొచ్చి ఈ గుండెల్లో పడిపోయాడేమో అని ఆ గుండంలో వెతుకులాట కొనసాగించారు.
అలా వెతుకుతున్నటువంటి భక్తులకు సాధువుకు బదులుగా ఒక విగ్రహం కనిపించింది.
ఆ విగ్రహాన్ని గుండం నుంచి బయటికి తీసి చూడగా సాధువు ధరించిన వస్త్రమే కట్టబడి ఉంది,
అక్కడ ఉన్న భక్తులందరూ ఆశ్చర్యపోతున్న సమయాన, విగ్రహాని గుండంలో నుంచి బయటికి తీసిన
వ్యక్తి శ్రీనివాసుడు వంటిపైకి ఆవహించి భక్తులారా నేను సాధురూపంలో ఉన్న శ్రీమన్నారాయనున్ని
కలియుగ ధర్మానికి తగ్గట్టుగా శ్రీ వెంకటేశ్వరునిగా ఈ విగ్రహ రూపంలో ఆవిర్భవించాను అని చెప్పడం జరిగింది.
ఈ విగ్రహం ఎలా ఉందంటే అన్నమాచార్యుడు తన సంకీర్తనలో చెప్పినట్లుగా
“ఇందరికి అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి ”
అన్నట్లుగా ఆ వైభవ,సుందర, ఆనందమూర్తి బంగారు చేయితో
బంగారు వక్షస్థలముతో బంగారు తిరునామముతో
అక్కడకు వచ్చిన భక్తుల ఆనందానికి అవధులు లేనట్లుగా ఆ సుందర ఆనందమూర్తి దర్శనము,
జన్మ జన్మలకు దొరకని అదృష్టముగా భావించి అప్పటికే నిర్మాణమైన ఆ ఆలయంలో
సుందర వెంకటేశ్వరుని ప్రతిష్టించుకున్నారు. అప్పటినుండి ఎంతో వైభవముగా
ఈ ఆలయ వైష్ణము నలు దిక్కుల వ్యాపించింది
.
ప్రతి సంవత్సరము శ్రీ పంచమి నాడు స్వామివారి కల్యాణము ,
రథసప్తమి రోజున రథోత్సవము అంగరంగ వైభవముగా ఇక్కడి భక్తులు జరుపుకునే వారు.
ఎంతో వైభవముగా జరుగుతున్న ఆలయ వైశిష్టము సుమారు 90 సంవత్సరాల కిందట
కొంతమంది దొంగల దురాశ చే నిధులు నిక్షేపాలు ఉన్నాయన్న ఆలోచనతో ఆలయమంతా
త్రవ్వకాలు జరిపి ఏమియును లభించకపోయేసరికి సుందర స్వర్ణా భరమైన విగ్రహం వైపు వారి దృష్టిపడి,
ఆ దుండగులు దుర్మార్గులు స్వామివారి కవచనానంత ఒలుచుకొని , వరద ఆస్థాని భిన్నం చేసి,
నామాలవాడి నామాన్ని ఒలిచి తీసుకొని వెళ్ళిపోయారు.
స్వామికి దుండగుల పై కలిగిన జాలియే మనపై ఉన్న అనుగ్రహ కటాక్ష రసము,
మన చేత 14 అడుగుల చతుర్దశ భునాదీశ్వరుడిగా ఆవిర్భవించాలన్న కోరికో
ఆ స్వామి ఆ రోజు మౌనంగా ఉండిపోయారు. తెల్లవారి నిత్యారాధన కొరకే వచ్చిన అర్చక స్వామికి
శ్రియ :పతి ఆహ్వానించి, వత్సా! 90 సంవత్సరముల తర్వాత
పున వైభవ శ్రీ వెంకటేశ్వరనిగా ఇక్కడ ఆవిర్భవిస్తాము అని చెప్పి స్వామి అంతర్ధానమయ్యాడు,
అలాంటి ఆలయము ఈ తరం వారి పునర్జన్మ సుకృతం చేత వైభవ సుందర ఆనంద విరాట్ రూపముగా
ఆ వెంకటనాధుని ప్రతిష్ట వైభవము శ్రీ పంచమి రోజున అంగరంగ వైభవంగా జరిగింది.

ఆలయంలో కొలువైన వివిధ దేవతామూర్తులు